నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సెన్సార్ బోర్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వార్తాపత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ వంటి సంస్థలు రూపొందించుకున్నట్లుగా ఓటీటీలు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. లేకపోతే తామే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఓటీటీలో ప్రదర్శించే చిత్రం లేదా వెబ్ సిరీస్‌ను పర్యవేక్షించుకోవాలని సదరు సంస్థలకు తెలిపింది. తద్వారా ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.
"ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో.. కొత్తగా వచ్చిన చిత్రం 'తాండవ్' దేశంలో కలకలం రేపుతోంది. ఆ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, మాటల పట్ల.. చాలా సంస్థలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. చిత్రాన్ని నిషేధించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించాయి. ఇలాంటి చిత్రాల ప్రదర్శనలో ఓటీటీలు స్వీయ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా స్వీయ నియంత్రణ నిబంధనలను రూపొందించుకోవాలి."
-కేంద్ర ప్రభుత్వం