2020.. ఎన్నో ఆనందోత్సాహాలతో ప్రారంభమైన ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ఎంతో కఠినంగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. కాగా, మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుండడం వల్ల పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలు తమ ప్రియమైన వారితో కలిసి హాలీడేను ఎంజాయ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తమ కుటుంబసభ్యులతో కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం కోసం బ్యూటిఫుల్ డెస్టినేషన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో కొంతమంది తారలు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ల వద్ద దర్శనమిస్తున్నారు.
మనువుతో ఒక్కటైన చోటికే..
సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే సామ్-చై 2021కు ఆహ్వానం పలికేందుకు బెస్ట్ ప్లేస్‌గా గోవాను ఎంచుకున్నారు. దీంతో ఈ జంట తాజాగా గోవాకు పయనమయ్యింది. 2017లో చై-సామ్‌ల వెడ్డింగ్ గోవాలోనే జరిగిన విషయం తెలిసిందే. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ జంట పోస్ట్ చేసే ఫొటోల కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోవా నుంచి వచ్చాక సామ్.. సామ్‌జామ్, కాతువక్కుల రెండు కాదల్, ఫ్యామిలీ మ్యాన్2 చిత్రీకరణల్లో బిజీ కానున్నారు. చైతన్య సైతం లవ్‌స్టోరీ షూట్లో భాగం కానున్నారు.
పింక్సిటీకి బాలీవుడ్ ప్రేమజంట..
బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్-ఆలియాభట్ కొత్త సంవత్సర వేడుకల కోసం పింక్‌సిటీగా పేరుపొందిన జైపూర్‌ను ఎంచుకున్నారు. రణ్‌బీర్ కుటుంబసభ్యులతో కలిసి ఆలియా ఈ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ జంట తాజాగా జైపూర్ చేరుకుంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న నీతూకపూర్(రణ్‌బీర్ తల్లి) వేడుకల్లో పాల్గొంటున్నారు. వెకేషన్ నుంచి రాగానే.. ఆలియా-రణ్‌బీర్ బ్రహ్మాస్త్రట షూట్‌తో బిజీ కావొచ్చు అని బీటౌన్ వర్గాలు అనుకుంటున్నాయి.
దీప్‌వీర్ కూడా అక్కడికే..
బాలీవుడ్లో లవ్లీ కపుల్‌గా పేరుపొందిన మరో జంట దీపికాపదుకొణె-రణ్వీర్ సింగ్. 2020కు ముగింపు పలికేందుకు తాజాగా ఈ జంట జైపూర్‌కు వెళ్లారు. రణ్‌బీర్‌కపూర్-ఆలియా జంటతో కలిసి దీప్-వీర్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. మరోవైపు దీపికా-రణ్వీర్ కలిసి నటించిన 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మాల్దీవులకు మరో ప్రేమజంట..