తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దళపతి విజయ్​కు శుభాకాంక్షల వెల్లువ - రాధిక

కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​ దళపతి పుట్టినరోజు సందర్భంగా సోషల్​మీడియాలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులూ విషెస్​ చెబుతున్నారు.

Celebreties sends Birthday Wishes to Thalapathi Vijay in Social Media
విజయ దళపతికి నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

By

Published : Jun 22, 2020, 1:04 PM IST

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నెట్టింట్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో వరుస పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారు. దీంతో #HBDTHALPATHYVijay అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు విజయ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన కథానాయకుడిగా నటించిన 'మాస్టర్‌' సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

"హ్యాపీ బర్త్‌డే విజయ్‌. మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మాకెప్పుడూ స్ఫూర్తిగా ఉండాలని ఆశిస్తున్నాను" - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

"సాధారణంగా నేను ఓ నటిగా ట్వీట్‌ చేస్తుంటాను. కానీ ఈరోజు మాత్రం ఓ అభిమానిగా ట్వీట్‌ చేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు విజయ్‌" - కల్యాణి ప్రియదర్శన్‌

"హ్యాపీ బర్త్‌డే విజయ్‌. ఈ ఏడాది మొత్తం మీకు ఆరోగ్యం, ఆనందం సొంతం కావాలని ఆశిస్తున్నాను" - మురుగదాస్‌

"ఇండస్ట్రీలో నేను కలిసిన ఓ మంచి హృదయమున్న అందమైన వ్యక్తి విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు" - హన్సిక

"పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్‌ విజయ్‌. మీరు ఇలాగే అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయాలని, అలాగే ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆశిస్తున్నాను. శరత్‌కుమార్‌, మీ వీరాభిమాని రాహుల్‌ శరత్‌ తరఫున మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" - రాధిక

"మాస్టర్‌' సినిమా షూటింగ్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను అందించింది. మీతో కలిసి గడిపిన ప్రతి రోజు, ప్రతి నిమిషాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే విజయ్‌. లవ్‌ యూ"-లోకేశ్‌ కనకరాజు

ఇదీ చూడండి... మాస్క్​తో రానా-మిహీక ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్

ABOUT THE AUTHOR

...view details