తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేథరిన్​​ లక్కీ ఛాన్స్: అటు అబ్బాయ్​.. ఇటు బాబాయ్

ముద్దుగుమ్మ కేథరిన్.. నందమూరి బాలకృష్ణ, కల్యాణ్​రామ్​ కొత్త సినిమాల్లో హీరోయిన్​గా ఎంపికైందట. వీటిపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

By

Published : Dec 20, 2019, 11:33 AM IST

హీరోయిన్ కేథరిన్
కేథరిన్-బాలకృష్ణ-కల్యాణ్​రామ్

హీరోయిన్ కేథరిన్ బంపర్ ఆఫర్​ కొట్టేసింది. ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. అందులో బాలకృష్ణ సినిమా ఒకటి.. కల్యాణ్​రామ్ చిత్రం మరొకటి. వీటిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందట.

హీరోయిన్ కేథరిన్

నందమూరి బాలకృష్ణ 'రూలర్'.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయనున్నాడు. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కేథరిన్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్ విలన్​గా నటించనున్నాడట.

హీరో కల్యాణ్​రామ్.. 'ఎంత మంచివాడవురా' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వేణు మల్లాడి అనే కొత్త దర్శకుడుతో కలిసి పనిచేయనున్నాడు. ఇందులో కేథరిన్​ను హీరోయిన్​గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుందట.

ఇది చదవండి: రొమాన్స్‌కి కేథరిన్‌.. పోరుకి శ్రీకాంత్‌..!

ABOUT THE AUTHOR

...view details