తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శిల్పాశెట్టి, కుంద్రా దంపతులపై చీటింగ్​ కేసు - Shilpa Shetty cheating case

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రాపై మరో చీటింగ్​ కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త వారిపై కేసు పెట్టారు. తన దగ్గర నుంచి రూ.1.51కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

shilpa
శిల్పా

By

Published : Nov 14, 2021, 12:49 PM IST

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్​కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్​ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై కేసు పెట్టినట్లు వెల్లడించారు.

శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా ప్రారంభించిన ఫిట్​నెస్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51లక్షలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని సదరు వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు.

2014లో ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ డైరెక్టర్​ కాషిఫ్​ కాన్​, శిల్పాశెట్టి, రాజ్​కుంద్రాతో పాటు ఇతరులు తమ సంస్థలో రూ.1.51కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు తెలిపారు నితిన్. ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ తనకు ఫ్రాంచైజీ కేటాయిస్తుందని.. పుణెలోని హడప్సర్​, కోరేగాన్​లలో జిమ్​, స్పా తెరుస్తుందని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదని, అందుకే తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే వారు బెదరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

అంతకుముందు రాజ్​కుంద్రా.. అశ్లీల చిత్రాల కేసులో జైలుకెళ్లారు. ఇటీవలే ఆయన బెయిల్​పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

ఇదీ చూడండి: మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

ABOUT THE AUTHOR

...view details