బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, రణ్బీర్, ఆలియా భట్, టాలీవుడ్ హీరో నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా "బ్రహ్మాస్త్ర". దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది.
"బ్రహ్మాస్త్ర" లోగో
అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "బ్రహ్మాస్త్ర" లోగో నెట్టింట్లో సందడి చేస్తోంది.
విడుదలైన బ్రహ్మస్త్ర అఫిషీయల్ లోగో
బ్యాక్ గ్రౌండ్లో అమితాబ్ వాయిస్ సినిమాపై ఆసక్తి పెంచుతోందంటూ... అభిమానులు తమ సంతోషాన్ని ట్విట్టర్వేదికగా పంచుకుంటున్నారు.
ఇటీవలే ప్రయాగ్రాజ్ వద్ద 'కుంభమేళా'లో జరిగిన లోగో ఆవిష్కరణలో చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.