తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాధికా ఆప్టేను బహిష్కరించండి.. నెటిజన్ల డిమాండ్ - రాధికా ఆప్టే లేటెస్ట్ మూవీలు

బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టేకు మరోసారి 'పార్చ్‌డ్‌' సెగ తాకింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకించే చిత్రాల్లో రాధిక నటిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రాధికపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటంటే?

Radhika Apte
బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే

By

Published : Aug 14, 2021, 12:47 PM IST

సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టేకు మరోసారి 'పార్చ్‌డ్‌' సెగ తాకింది. ఆమెను వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని.. ఆమె నటించిన సినిమాలు అస్సలు చూడకూడదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే చిత్రాల్లో రాధిక నటిస్తున్నారంటూ పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో #BoycottRadhikaApte అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్​లో ట్రెండ్ అవుతోంది.

బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే

2005లో విడుదలైన 'వాహ్‌!! లైఫ్‌ హో తో హసీ' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక.. బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి విభిన్నమైన కథల్లో నటిస్తూ ఆమె మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలా ఆమె స్త్రీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన 'పార్చ్‌డ్‌'లో ప్రధాన పాత్ర పోషించారు. 2016లో ఆ సినిమా విడుదలై విమర్శలు ఎదుర్కొంది. అశ్లీల సన్నివేశాల్లో రాధిక నటించడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా 'పార్చ్‌డ్‌' నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు.. రాధికా ఆప్టేపై మళ్లీ మండిపడుతున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు రాధిక మచ్చతెస్తోందని.. అలాంటి వారితో సినిమాలు చేయడం మంచిది కాదంటున్నారు. అలాగే, 'రక్త చరిత్ర', 'లెజెండ్‌' చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన ఆమె ఇటీవల కాలంలో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో నటించడం గమనార్హం.

ఇదీ చదవండి:అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది: మేఘ

ABOUT THE AUTHOR

...view details