తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుమారుడితో ఆ సినిమా రీమేక్​ చేస్తున్న బోనీ కపూర్ - బోనీ కపూర్, అర్జున్ కపూర్​

బాలీవుడ్​ నిర్మాత బోనీకపూర్​ తమిళ చిత్రం 'కోమలి'ని హిందీలో రీమేక్​ చేయబోతున్నాడు. ఇందులో బోనీ తనయడు అర్జున్ కపూర్​ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

బోనీ కపూర్, అర్జున్ కపూర్​

By

Published : Sep 21, 2019, 11:24 AM IST

Updated : Oct 1, 2019, 10:37 AM IST

కోమా నుంచి కోలుకున్న ఓ మనిషి ప్రస్తుత పరిస్థితులను సర్దుబాటు చేసుకోలేక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో చూపిస్తూ విభిన్న కథాంశంతో తెరకెక్కింది 'కోమలి' చిత్రం. తమిళంలో మంచి హిట్​ అందుకున్న ఈ సినిమా రీమేక్​కు ప్రస్తుతం నిర్మాత బోనీ కపూర్​ సన్నాహాలు చేస్తున్నాడు.

'కోమలి' హిందీ రీమేక్​లో అర్జున్​ కపూర్ కథానాయకుడని.. హిందీతో పాటు తెలుగు, కన్నడలో ఈ చిత్రం రానుందని తెలుస్తోంది.

"కోమలి రీమేక్​ హక్కులను అన్ని భాషల్లో కొనుగోలు చేశా. హిందీ రీమేక్​లో అర్జున్​ కథానాయకుడిగా నటిస్తున్నాడు." - బోనీ కపూర్​, నిర్మాత

ప్రస్తుతం బోనీ కపూర్​ అజయ్​ దేవ్​గణ్​తో 'మైదాన్​'ను నిర్మిస్తున్నాడు. ఫుట్​బాల్​ ఆట నేపథ్యంలో సాగతుందీ చిత్రం. అమిత్​ శర్మ దర్శకుడు.

ఇదీ చూడండి: వరుణ్​ కెరీర్​లో బ్లాక్​బస్టర్ ఓపెనింగ్స్ ఇవే!

Last Updated : Oct 1, 2019, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details