ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుటుంబానికి (boney kapoor family) ప్రతిష్ఠాత్మక దుబాయ్ గోల్డెన్ వీసా (dubai golden visa) మంజూరైంది. ఈ వీసాతో వారికి 10 ఏళ్ల పాటు దుబాయ్‌లో నివసించే అవకాశం లభిస్తుంది.
"నాకు, నా కుటుంబానికి గోల్డెన్ వీసా జారీచేసిన దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. వారిది ధైర్యవంతమైన, దయగల నాయకత్వం. దుబాయ్, యూఏఈ.. అత్యుత్తమ గమ్యస్థానాలు."
- బోనీ కపూర్, బాలీవుడ్ నిర్మాత
గోల్డెన్ వీసాను 2019లో యూఏఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్వెస్టర్లు (కనీసం 10మిలియన్ల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు- సుమారు రూ.20లక్షలు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, క్రీడలు వంటి రంగాల్లో ప్రముఖులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని 5 లేదా 10 సంవత్సరాలకు ఇస్తారు. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా పునరుద్ధరిస్తారు.
వీరికి కూడా..
ప్రముఖ బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి సహా మలయాళీ దిగ్గజాలు మమ్ముట్టీ, మోహన్‌లాల్, యువ నటుడు టొవినో థామస్‌లను కూడా గోల్డెన్ వీసా వరించింది.
ఇదీ చూడండి:రూ.400కోట్లతో అజయ్‌దేవగణ్ కొత్త సినిమా!