జేమ్స్‌బాండ్ సిరీస్‌లో రాబోతున్న 25వ చిత్రం బాండ్ 25. తాజాగా ఈ సినిమా పస్ట్ లుక్ విడుదలైంది.బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జమైకాలో షూటింగ్ జరపుకుంటోంది. కేరీ దర్శకత్వం వహిస్తున్నాడు.
మేకింగ్ వీడియోలో జేమ్స్‌బాండ్ ఫస్ట్‌లుక్ - daniel craige
డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 'బాండ్ 25' చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రస్తుతం జమైకాలో షూటింగ్ జరపుకుంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది.
మేకింగ్ వీడియో రూపంలో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌లో డేనియల్ క్రేగ్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తాడు. ఆస్కార్ గ్రహీత రమీ మాలెక్ విలన్‌గా నటిస్తన్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో జెఫ్రీ రైట్, లషానా లించ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించాడు డేనియల్ క్రేగ్. ఇది అయిదో సినిమా. 2006లో వచ్చిన క్యాసినో రాయల్ చిత్రంలో తొలిసారి బాండ్ అవతారమెత్తాడు క్రేగ్. తర్వాత క్వాంటమ్ ఆఫ్ సోలాస్, స్కై ఫాల్, స్పెక్టర్ సినిమాల్లో నటించాడు.