గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల ఈ నటుడు.. నిన్న(మంగళవారం) అనారోగ్య సమస్యల కారణంగా ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఈయన మృతిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత - BOLYWOOD ACTOR IRRFAN KHAN cancer
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్.. ముంబయిలో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈయన... న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి కోసం విదేశాల్లోనూ చికిత్స తీసుకుని వచ్చారు. ఈ మధ్యనే తల్లి సయిదా బేగం రాజస్థాన్‌లో కన్నుమూసినా.. కడసారి చూపునకు నోచుకోలేకపోయారు ఇర్ఫాన్.
1988లో 'సలాం బాంబే' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఇర్ఫాన్..... అనేక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. 2018లో 'ఫజిల్' అనే హాలీవుడ్ సినిమాలో రాబర్ట్‌గా నటించారు. పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ ఆయన నటించారు. తెలుగులో మహేష్‌బాబు 'సైనికుడు'లో పప్పు యాదవ్ పాత్రలో కనిపించారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్', 'మఖ్భూల్', 'లంచ్‌బాక్స్' చిత్రాలు ఇర్ఫాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.