తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైవిధ్యమైన పాత్రలో ఆయుష్మాన్​ ఖురానా! - హిందీ సినిమా ట్రైలర్స్​

బాలీవుడ్​ కథానాయకుడు ఆయుష్మాన్​ ఖురానా మరో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. 2017లో విడుదలైన 'శుభ్​ మంగల్​ సావధాన్' సీక్వెల్​గా రూపొందిన సినిమా ఫస్ట్​లుక్​ని విడుదల చేసింది చిత్రబృందం.

వైవిధ్యమైన పాత్రలో ఆయుష్మాన్​ ఖురానా!

By

Published : Nov 15, 2019, 7:38 PM IST

హిందీలో విజయవంతమైన చిత్రాలకు చిరునామగా మారాడు ఆయుష్మాన్‌ ఖురానా. తాజాగా బట్టతల యువకుడిగా వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2017లో అతడు నటించిన‘శుభ్‌ మంగల్‌ సావధాన్​' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కిన చిత్రం‘శుభ్‌ మంగల్‌ జ్యాదా సావధాన్‌’తో పలకరించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమాలో ఆయుష్మాన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో అతడు గేగా కనిపించనున్నాడు.2020 ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హితేశ్ కేవాలియా ఈ సినిమాకు దర్శకుడు. నీనా గుప్తా, గిరిరాజ్ రావు కీలక పాత్రలు పోషించనున్నారు.

వైవిధ్యమైన పాత్రలో ఆయుష్మాన్​ ఖురానా!

ABOUT THE AUTHOR

...view details