తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అర్జున్​-మలైకా పెళ్లికి సిద్ధమవుతున్నారా..? - అర్జున్​ కపూర్​, మలైకా అరోరా పెళ్లి

బాలీవుడ్​ నటీనటులు అర్జున్​ కపూర్​, మలైకా అరోరా చాలా రోజులుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కూడా చేసుకోనున్నట్లు పుకార్లు వినిపించాయి. వాటిపై బహిరంగంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు ఈ జోడీ. అయితే తాజాగా మలైకా పెట్టిన పోస్టు వాటికి మరింత బలం చేకూరుస్తోంది.

Bollywood Actress Malaika Arora kiss on Arjun Kapoor's Cheek
అర్జున్​-మలైకా పెళ్లికి సిద్ధమవుతున్నారా..?

By

Published : Jan 2, 2020, 5:31 AM IST

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. నూతన సంవత్సరం సందర్భంగా తన ప్రియుడు, బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌కు ముద్దిచ్చిన ఫొటోను షేర్‌ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఎన్నో వేడుకల్లో జంటగా కనిపించిన ఈ జోడీ.. వారి ప్రేమాయణంపై మాత్రం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ తాజా ఫొటోతో.. అభిమానులు వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల అర్జున్‌ కుటుంబాన్ని మలైకా కలవడం వెనుక రహస్యం ఇదే అని కామెంట్లు పెడుతున్నారు.

మలైకా షేర్​ చేసిన ఫొటో ఇదే

మలైకా 1998లో బాలీవుడ్​ అగ్ర హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు.. అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2017లో విడాకులు తీసుకుంది. వీరు విడిపోవడానికి అర్జున్‌ కారణమని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోడల్‌ జార్జియా ఆండ్రియానితో అర్బాజ్‌‌ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అర్జున్‌ కపూర్​ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దది కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details