బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు 'మీర్జాపుర్' వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అలీ ఫజల్ తల్లి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో జూన్ 17 ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరణించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు అలీ. ఈమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే ఈ ఏడాదిలో అలీ ఫజల్-నటి రిచా చద్దా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. "శాంతితో విశ్రాంతి తీసుకోండి అంటీ" అంటూ రిచా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
'మీర్జాపుర్' నటుడు అలీ తల్లి కన్నుమూత - అలీ ఫజల్ తల్లి మృతి
బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ తల్లి.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు అలీ.
అలీ ఫజల్
'హ్యాపీ భాగ్ జయెగి', 'విక్టోరియా అండ్ అబ్దుల్', 'బాబీ జసూస్' తదితర చిత్రాల్లో గుర్తింపు తెచ్కుకున్నాడు అలీ ఫజల్. గతేడాది నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన 'హౌస్ అరెస్ట్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు.
ఇది చూడండి : అందుకే హిందీ సినిమాలు చేయలేదు: రమ్యకృష్ణ