తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్​పై విజయ్ ఫ్యాన్స్​ దాడి

విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం ఈరోజు విడుదలైంది. స్పెషల్​ షో వేయలేదని ఆగ్రహించిన ఫ్యాన్స్​ ఓ థియేటర్​ను ధ్వంసం చేశారు.

విజయ్

By

Published : Oct 25, 2019, 11:22 AM IST

థియేటర్​పై విజయ్ ఫ్యాన్స్ దాడి

తమిళనాడులోని కృష్ణగిరిలో హీరో విజయ్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. తమ అభిమాన హీరో విజయ్ కొత్త సినిమా.. బిగిల్ స్పెషల్ షో వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్‌ను ధ్వంసం చేసి.. బయట ఉన్న షాపులకు నిప్పు పెట్టారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ధ్వంసం చేశారు. పోలీసు, మున్సిపల్ వాహనాలను ధ్వంసం చేశారు. సినిమా వేసేంతవరకు తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అల్లర్లకు పాల్పడిన 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిమంది కోసం గాలింపు చేపట్టారు.

బిగిల్ సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చే విషయంలో జాప్యం చేసిన తమిళనాడు ప్రభుత్వం.. నిన్న సాయంత్రం ఇందుకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా బిగిల్ మూవీ షో వేయలేదని... కృష్ణగిరిలోని థియేటర్‌పై అభిమానులు దాడికి దిగారు. ఇదే సినిమా తెలుగులో విజిల్‌ పేరుతో విడుదల కానుంది.

ఇవీ చూడండి.. దీపిక ద్రౌపదిగా 'మహాభారతం'...

ABOUT THE AUTHOR

...view details