తన నటనతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. గతేడాది 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలతో హిట్లు అందుకున్న ఇతడు ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైంది. ఇందులో నాని ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నాని. పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.
నటుడు, దర్శకుడు.. మీలో ఎవరు ఎక్కువ భాగం ఉన్నారు?
నాని: నాలో దర్శకుడి కన్నా నటుడే ఎక్కువగా కనిపిస్తాడు. ఆడియన్స్‌కు ఏం కావాలి అనే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తుంటా.
'వి' సినిమా పరంగా మీకు సవాలుగా అనిపించిన విషయం?
నాని: చిత్రం విడుదల కోసం ఇన్ని రోజులు ఎదురుచూడటం.
రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే చేస్తారా?
నాని: నేనే కాదు దేశంలోని ఏ నటుడైనా ఓకే చెప్తాడు.
'ఈగ'లో మీరు కేవలం అర్ధ గంట మాత్రమే కనపడ్డారు కదా?
నాని: అవును.. అయినా ఆ చిత్రంలో నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. దాన్ని నేను ఊహించలేదు. అప్పటి వరకు నేను తెలుగు వారికి మాత్రమే తెలుసు. బయట ఒక్కరికి కూడా నా గురించి తెలియదు. కానీ 'ఈగ' విడుదలైన తర్వాత అందరూ నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. దుబాయ్‌కి షూట్‌కు వెళ్లినప్పుడు అక్కడి వారు కూడా నన్ను పలకరించడం ఆనందంగా అనిపించింది. 'ఈగ' చిన్న పిల్లలకి ఇంకా బాగా నచ్చింది.
బాలీవుడ్‌లో ఎవరితో కలిసి పనిచేయాలని ఉంది?
నాని: అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్‌తో కలిసి నటించాలని ఉంది.
మీరు ఉత్తమ నటుడిగా ఉండాలి అనుకుంటున్నారా?, సూపర్‌స్టార్ అవ్వాలి అనుకుంటున్నారా?
నాని: నేను ఉత్తమ నటుడిగా ఉండాలి అనుకుంటున్నా. సూపర్‌స్టార్ కావాలి అనే ఆశ లేదు.. ఎందుకంటే అది బరువుతో కూడుకున్న పని.
మీ సహ నటీమణుల్లో ఎవరైనా, ఎప్పుడైనా మీకు ప్రపోజ్ చేశారా?
నాని: పరోక్షంగా ప్రపోజ్ చేశారు.
మీరెప్పుడైనా మీ మాజీ ప్రేయసితో సోషల్‌మీడియాలో మాట్లాడారా?
నాని:నాకు మాజీ ప్రేయసి లేదు. నాకున్నది ఒక్క గర్ల్‌ఫ్రెండే. తననే పెళ్లి చేసుకున్నా.