తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bigg Boss 5: ఈ వారం నామినేట్‌ అయింది వీళ్లే - bigboss nagarjuna

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంతకీ నామినేషన్స్​లో ఉన్నది ఎవరంటే?

bigboss
బిగ్​బాస్​

By

Published : Nov 16, 2021, 7:08 AM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వీకెండ్‌లో నాగార్జున(bigg boss nagarjuna telugu)

వచ్చిన సందర్భంగా జరిగిన పరిణామాలపై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. ‘వీకెండ్‌లో మారిన పరిస్థితుల బట్టి మారతావా’ అని మానస్‌(bigboss Manas) అంటున్నాడని కాజల్‌ను(bigboss kajal) సన్నీ(bigboss sunny) అడిగాడు. ‘గేమ్‌ విషయంలో అలా అయితే తీసుకోనని, సలహా అయితే తీసుకుంటా’నని కాజల్‌ చెప్పింది. ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ల వద్దని, కరవని కుక్కనైనా కెలికితే కరిచి వదిలి పెడుతుందని సిరి(bigboss siri), షణ్ముఖ్‌(bigboss shanmukh), రవిలతో(Ravi) తనకు జరిగిన గొడవను ఉద్దేశించి సన్నీ చెప్పుకొచ్చాడు. ఇక నటరాజ్‌ మాస్టర్‌లా( bigboss Nataraj) హౌస్‌మేట్స్‌కు జంతువుల పేర్లు పెట్టాడు సన్నీ. అనీ మాస్టర్‌ అనకొండ, శ్రీరామ్‌ చంద్రకు(bigboss Sri ram chandra) స్లాత్‌(బద్ధకంగా ఉండే కోతిలాంటి జీవి)‌, రవి ఏ జన్మకైనా గుంట నక్క, సిరి కట్ల పాము, షణ్ముఖ్‌ బ్లాక్ ఫాక్స్‌ అని చెప్పుకొచ్చిన సన్నీ తనని తాను చింపాంజీగా పేర్కొన్నాడు. ఇక తెలుగులో మాట్లానందుకు అనీ మాస్టర్‌కు(bigboss Anne master) కెప్టెన్‌ రవి శిక్ష వేశాడు. గేటు దగ్గర నిలబడి వచ్చే పోయే వాళ్లకు సెల్యూట్‌ చేయాలని ఆదేశించాడు.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే!(Bigg Boss Telugu 5 Nominated contestants)

ఈ వారం హౌస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు అర్హతలేని ఇద్దరు వ్యక్తులను ఎంచుకుని, తగిన కారణాలు చెప్పమని బిగ్‌బాస్‌ సూచించాడు. అనంతరం వారి తలపై స్లైమ్‌ను పోసి నామినేట్‌ చేయాలని అన్నాడు. తనని ‘ఫేక్‌’ అనడం, గతవారం తాను సలహాలు ఇస్తే తీసుకోకపోగా, అరవటం నచ్చలేదని సన్నీని నామినేట్‌ చేశాడు రవి. ఇక సన్నీ తనతో గొడవ పడుతుంటే ఆపాల్సింది పోయి రెచ్చగొట్టావంటూ కాజల్‌ను రెండో వ్యక్తిగా నామినేట్‌ చేశాడు. అయితే, తాను సన్నీని ఎప్పుడూ రెచ్చగొట్టలేదని కాజల్‌ వివరణ ఇచ్చుకుంది.

నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి

కాజల్‌ను షణ్ముఖ్ నామినేట్‌ చేస్తూ, ‘నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి. అందుకే నామినేట్‌ చేస్తున్నా’ అని అన్నాడు. దీనిపై ఓ నవ్వు నవ్వి ఊరుకుంది కాజల్‌. ఎవరైనా నామినేట్‌ చేస్తే వాళ్లను తిట్టడం, ‘చెత్త రీజన్స్‌’ అనడం బాగోలేదని ప్రియాంకను నామినేట్‌ చేశాడు షణ్ణు. ఏదో ఊహించుకుని గేమ్‌ ఆడుతున్నావంటూ షణ్ముఖ్‌ను, తనతో సరిగా మాట్లాడటం లేదని అనీ మాస్టర్‌ అనడం బాధకలిగించిందని ఆమెను మానస్‌ నామినేట్‌ చేశాడు. సన్నీ మంచి గేమర్‌ అని, అయినా టాస్క్‌లో సహనం కోల్పోతున్నాడని శ్రీరామ్‌ అతడిని నామినేట్‌ చేశాడు. షణ్ముఖ్‌-సన్నీల మధ్య గొడవ జరిగితే ఆపలేదంటూ మానస్‌ తలపై స్లైమ్‌ పోశాడు శ్రీరామ్‌. ‘ఎంట్రీ అయినప్పటి నుంచి కలుద్దామని ప్రయత్నించా. కానీ, ఎప్పుడూ నన్ను దూరం పెట్టారు. పైగా వెక్కిరిస్తూ అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారంటూ అనీ మాస్టర్‌ను... ‘ఇంటి నుంచి బయటకు వెళ్తే గొడవలు తగ్గుతాయి అనడం నాకు నచ్చలేదు’ అని షణ్ముఖ్‌ను కాజల్‌ నామినేట్‌ చేసింది.

సన్నీ VS శ్రీరామ్‌..

‘ఇన్ని రోజులు ప్రియాంక నటించినట్లు అనిపించింది. తన గేమ్‌తో పాటు, మానస్‌ గేమ్‌ కూడా ఆడుతోందని అనుకుంటున్నా. అందుకే ఆమెను నామినేట్‌ చేస్తున్నా’ అంటూ పింకీని, మాటలు సరిగా లేవని, అబద్ధాలు ఆడుతోందని కాజల్‌ను సిరి నామినేట్‌ చేసింది. తనని నామినేట్‌ చేసినందుకు షణ్ముఖ్‌, సిరిలను ప్రియాంక తిరిగి నామినేట్‌ చేసింది. మాస్క్‌ తీసి బయటకు రావాలంటూ శ్రీరామ్‌ను‌, గత వారం టాస్క్‌ సందర్భంగా తనని అడ్డుకుని గొడవకు కారణమైన సిరిని సన్నీ నామినేట్‌ చేశాడు. ఈ సందర్భంగా శ్రీరామ్‌-సన్నీల మధ్య కాస్త వాడీవేడీ చర్చ జరిగింది. హగ్‌ పాయింట్‌ను బయటకు తీసి, తనని నామినేట్‌ చేయటం ఫన్నీగా అనిపించిందని మానస్‌ను, మొదటి నుంచి కాజల్‌తో నెగెటివ్‌ వైబ్‌ ఉందని అందుకే ఆమెను నామినేట్‌ చేస్తున్నానని అనీ మాస్టర్‌ వారిద్దరి తలపై స్లైమ్‌ పోశారు. అలా ఈ వారం కెప్టెన్‌ అయిన రవి మినహా షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, ప్రియాంక, మానస్‌, కాజల్, సన్నీలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయ్యారు. ఇక ఈ వారం హౌస్‌మేట్స్‌కు ‘మీ ఇల్లు బంగారం కాను’ అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్‌ పోటీదారులు అయ్యారు. చివరకు ఎవరు కెప్టెన్‌ అయ్యారో తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్స్‌ చూడాల్సిందే!

ఇదీ చూడండి: 'నువ్వు నన్ను ఏం చేయలేవు'.. సిరి, షణ్ముఖ్ మాటల యుద్ధం!

ABOUT THE AUTHOR

...view details