Bheemla Nayak New Song: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను డిసెంబర్ 1న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 'అడవి తల్లి మాట' అంటూ సాగే ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్'ను తీస్తున్నారు. ఇందులో పవన్ పోలీస్‌గా, రానా సినీ నటుడి పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు అభిమానుల్ని తెగ అలరిస్తున్నాయి. 'లా లా భీమ్లా' గీతం (la la bheema song) అయితే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.