తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వారిద్దరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు' - sharmin

'మలాల్' సినిమా ట్రైలర్​ను ముంబయిలో ఇవాళ విడుదల చేశారు చిత్ర నిర్మాత సంజయ్​ లీలా భన్సాలీ. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన మెజాన్ జాఫ్రే, షర్మిన్ సెగల్ ఇద్దరూ చాలా కష్టపడ్డారని భన్సాలీ తెలిపాడు.

సంజయ్​ లీలా భన్సాలీ

By

Published : May 18, 2019, 9:46 PM IST

సంజయ్​ లీలా భన్సాలీ తన మేన కోడలైన షర్మిన్ సెగల్, జావేద్ జాఫ్రే కుమారుడైన మెజాన్ జాఫ్రేను 'మలాల్​' సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో సంజయ్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం షర్మిన్ చాలా కష్టపడిందని, 90 కేజీలున్న ఆమె బరువు తగ్గిందని తెలిపాడు.

"బాజీరావ్ మస్తానీకి షర్మిన్ అసిస్టెంట్​గా పనిచేసింది. ఆ సమయంలోనే కాస్ట్యూమ్ ట్రయల్​ కోసం మెజాన్​ను పరిచయం చేసింది షర్మిన్. అప్పుడే అనుకున్నాను ఇండస్ట్రీకి ఓ స్టార్ వచ్చాడని. ఈ చిత్రంలో ఇద్దరూ చాలా బాగా నటించారు" -సంజయ్ లీలా భన్సాలీ, బాలీవుడ్ దర్శకనిర్మాత.

"ఏ రంగంలోనైన బంధుప్రీతి ఉంటుంది. చిత్ర సీమలో అది త్వరగా కనిపిస్తుంది. తెలిసిన వాళ్లుంటే అవకాశాలు వెంటనే రావచ్చు, కానీ ఆ తర్వాత కష్టపడి తమను తాము నిరూపించుకోవాలి" -షర్మిన్ సెగల్

తెలుగు సినిమా '7జీ బృందావన్ కాలనీ' చిత్రానికి రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్​లీలా భన్సాలీ, భూషణ్​ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మంగేశ్ హడవాలే దర్శకుడు.

ఇది చదవండి: '7జీ బృందావన్ కాలనీ' ట్రైలర్ విడుదల

ABOUT THE AUTHOR

...view details