సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'భజరంగీ భాయ్‌జాన్'. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కథను సమకూర్చింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. జులై 17, 2015న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ జపాన్ థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇదే విషయాన్ని చిత్ర దర్శకనిర్మాత కబీర్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"మా హృదయాల నుంచి వచ్చిన 'భజరంగీ భాయ్‌జాన్'పై మీరు చూపిన అపుర్వమైన ప్రేమ మాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. మీ అందరికీ ధన్యవాదాలు. సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తైంది. అయినా ఇప్పటికీ జపాన్‌లోని కొన్ని థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది."