Bengali actor Abhishek Chatterjee: ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన తన నివాసంలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిషేక్ ఛటర్జీ మృతిపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు."అభిషేక్ ఛటర్జీ మరణ వార్త బాధించింది. ఎంతో ప్రతిభ కలిగిన నటుడిని కోల్పోయాం. ఇది సినీ పరిశ్రమకు తీరని లోటు" అని మమత ట్వీట్ చేశారు.
ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత - actor died
Abhishek Chatterjee: ప్రముఖ సీనియర్ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో గురువారం మరణించారు. ఆయన అనేక బెంగాలీ చిత్రాల్లో నటించారు. ఛటర్జీ మరణంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
Abhishek Chatterjee news
58 ఏళ్ల అభిషేక్ ఛటర్జీ.. బుధవారం ఓ చిత్ర షూటింగ్ సమయంలో కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన నివాసానికి తరలించి చికిత్స అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిషేక్.. 1986లో తరుణ్ మజుందార్ తీసిన 'పాత్భోలా'చిత్రంతో అరంగేట్రం చేశారు. 'దహన్','బరివాలి', 'అలో' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
ఇదీ చదవండి:RRR: 300రోజులు.. 3వేలమంది.. రూ.500కోట్ల బడ్జెట్!