తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2019, 2:52 PM IST

ETV Bharat / sitara

బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

టాలీవుడ్ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకొంది.

bellamkonda
బెల్లంకొండ

యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' చిత్రంతో విజయాల బాట పట్టాడు. ఇప్పుడు ఈ హిట్​ ట్రాక్​ను కొనసాగించాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. అందుకే 'రాక్షసుడు' మూవీ విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.

క్లాప్​నిస్తున్న వి.వి వినాయక్

'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్​తో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు.. నభా నటేష్ హీరోయిన్​గా కనిపించనుంది. నేడు ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్​లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయింది. టాలీవుడ్​కు చెందిన ప్రముఖులు దిల్​రాజు, వి.వి వినాయక్​తో పాటు పలువురు​ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

సంతోష్ శ్రీనివాస్​తో దిల్​రాజు

సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ తమ మొదటి చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్​ ప్యాక్​ బాడీతో కనిపించనున్నాడు.

శ్రీనివాస్, నభా నటేష్
దర్శకుడికి స్క్రిప్ట్ అందజేత

ఇవీ చూడండి.. సమీక్ష- 'రాజావారు-రాణిగారు' మెప్పించిందా..!

ABOUT THE AUTHOR

...view details