నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాను ఎంతో ఇష్టంగా తన స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం తెరకెక్కించారు బాలయ్య. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దివంగత నటి సౌందర్య ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈరోజు శ్రేయస్ ఈటీ ద్వారా సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే!
12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు.. కౌరవులకు తెలియకుండా మరో ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఆ ఏడాది కాలం ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని, తిరిగి రాజపాలకులుగా పట్టాభిషిక్తులు కావాలని ఆకాంక్షిస్తుంటారు పాండు కుమారులు.
విరాటరాజు కొలువులో మత్స్య దేశంలో నివాసం ఉండాలని నిర్ణయిస్తాడు అర్జునుడు.. నకుల, సహదేవులు.. అశ్వ, పశు సంరక్షకులు తామగ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతోనూ.. జూదక్రీడను అస్త్రంగా ఉపయోగించి కంకుభట్టు పేరుతో ధర్మరాజు.. ద్రౌపది, మాలిని పేరుతో దాసిగా, వలలుడు అనే పేరుతో భీముడిగా మారు పేర్లతో విరాట రాజు కొలువులో చేరాలని అనుకుంటారు. మరి అర్జునుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు.. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ..