తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమెరికా నేపథ్యంగా బాలయ్య కొత్త సినిమా - balayya shruthi hassan

బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన ఓ విషయం ఆసక్తి రేపుతోంది. అమెరికా నేపథ్యంగా సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

balakrishna
బాలకృష్ణ

By

Published : Nov 18, 2021, 6:33 AM IST

బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం.. ఇటీవల ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ జనవరి నుంచి మొదలుకానుంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. బాలకృష్ణను రెండు కోణాల్లో సాగే పాత్రలో చూపించనున్నారు. వాస్తవ సంఘటనలు, అమెరికా నేపథ్యంలో సాగే కథ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు.

బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details