నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం టీజర్ విడుదలైంది. బుధవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. "ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.." అంటూ విలన్లకు వార్నింగ్ ఇస్తున్న డైలాగ్‌లో బోయపాటి తన మార్క్‌ను చూపించారు. 'హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్ ఆన్ ది వే' అంటూ అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.
వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ మరో కొత్త ప్రాజెక్టుతో అలరించనున్నారు. హ్యాట్రిక్ సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.