నందమూరి నటసింహం బాలకృష్ణ.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'రూలర్'. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ ఉత్సాహంగా కనిపించాడు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను పలకరిస్తూ సందడి చేశాడు. వేదికపై మాట్లాడేందుకు కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదికలను పిలవగా బాలకృష్ణ ఒక అభిమానిలా మారిపోయి నోటికి చేతులు అడ్డుపెట్టుకుని అరుస్తూ కనిపించాడు.
బాలయ్య అరుపులకు అభిమానుల ఖుష్ - రూలర్
బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు వైజాగ్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య హుషారుగా కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు.
బాలయ్య ఉత్సాహం
చిరంతన్ భట్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చూడండి.. అనన్య పాండేకు తండ్రిగా సైఫ్ అలీఖాన్