నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాకు 'అఖండ' టైటిల్‌ను ఖరారు చేస్తూ.. ఉగాది సందర్భంగా అఘోర పాత్ర పరిచయ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. "కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది!!!" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. దీనికి తోడు తమన్ బ్యాగ్రౌండ్ మ్యాజిక్‌తో ఈ టీజర్ అదిరిపోయింది.
బోయపాటి సినిమాలో 'అఖండ'గా బాలయ్య - Balakrishna and Boyapati Srinu movie titled as Akhanda
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. 'అఖండ' అనే టైటిల్‌తో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బాలయ్య అఘోర లుక్‌లో అదరకొట్టే డైలాగులతో ఆకట్టుకున్నారు.
అఖండ చిత్రంలో బాలయ్య
ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ కథానాయికలు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయంతో మెప్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి:ఉగాది వేళ.. టాలీవుడ్లో పోస్టర్ల మేళ!
Last Updated : Apr 13, 2021, 12:58 PM IST