పెంపుడు జంతువులకు ముద్దు పేర్లు పెట్టుకుంటారనేది అందరికి తెలిసిందే. సులభంగా గుర్తుంచుకునేందుకు మనకు తెలిసిన చాలా పేర్లు ఉన్నాయి. కానీ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ విచిత్రమైన పేరు పెట్టాడు. తన గుర్రాలకు సినిమా పేరును పెట్టి ఆశ్చర్యపరిచాడు.
స్వతహాగా జంతువులంటే ఇష్టపడే భాయ్.. బజరంగీ భాయ్‌జాన్ చిత్రం విజయం సాధించిన సమయంలో రెండు కొత్త గుర్రాలను కొన్నాడు. ఈ సందర్భంగా ఒక గుర్రానికి బజరంగీ అని, మరోదానికి భాయ్‌జాన్ అని పేర్లు పెట్టాడు.