ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్లో సత్తాచాటి ప్రస్తుతం హాలీవుడ్లో బిజీ తారగా వెలుగొందుతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా తన అందాల ఆరబోతతో వార్తల్లో నిలుస్తోన్న ఈ భామ తాజాగా బాఫ్టా అవార్డుల వేడుక కోసం మరోసారి అదరగొట్టింది. ఫిష్ కట్ బ్లాక్ డ్రెస్‌తో నెట్టింట సెగలు రేపుతోంది. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ వేడుకకు హాజరైన ఈ భామ రెడ్ కార్పెట్‌పై మరోసారి తళుక్కుమంది.
బాఫ్టా వేడుకలో ప్రియాంక సోయగాలు - ప్రియాంక నిక్ జోనస్
బాఫ్టా అవార్డుల ప్రధానోత్సవం కోసం ప్రియాంకా చోప్రా అదిరిపోయే ఔట్ఫిట్తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ప్రియాంక, నిక్ జోనస్
ఈ ఫొటోలతో పాటు ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది ప్రియాంక. వీటిని చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుడుతున్నారు. కొందరు తన అందాన్ని పొగుడుతుంటే మరికొందరు మరీ ఇలాంటి డ్రెస్‌లు ఏంటంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా అత్యున్నత అవార్డుల వేడుకలో ప్రియాంక మరోసారి తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.
Last Updated : Apr 12, 2021, 11:43 AM IST