తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇప్పటివరకు రూ.15 కోట్లు సాయం చేశా: బిగ్​బీ

కరోనా కష్ట సమయంలో తాను ఇప్పటివరకు రూ.15 కోట్లు సాయం చేసినట్లు తెలిపారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. తన సేవల్ని ఇంకా కొనసాగిస్తానని వెల్లడించారు.

amitab
అమితాబ్

By

Published : May 11, 2021, 7:01 PM IST

కరోనా కష్టకాలంలో బాధితులకు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్. ఇప్పటివరకు తాను రూ.15 కోట్ల వరకు సాయం చేసినట్లు తెలిపారు. అవసరమైన వారికి సాయం చేస్తూనే ఉంటానని వెల్లడించారు. అందరూ తమకు తోచిన సహాయం చేయాలని అభ్యర్థించారు.

"ఈ కరోనా కష్ట సమయంలో చాలామంది సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. అలాగే నేను దిల్లీలోని ఓ కేర్ సెంటర్​కు రూ.2 కోట్లు విరాళం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు నేను రూ.15 కోట్ల వరకు సాయంగా ప్రకటించా. ఇవన్నీ నేను ఎక్కడా చెప్పలేదు. నా వ్యక్తిగత ఆదాయం నుంచి డబ్బులు ఇవ్వాలని భావిస్తే తప్పకుండా ఇస్తా. అలాగే నా సేవ చూసి మరికొందరు స్ఫూర్తిపొందుతారని అనుకుంటున్నా."

-అమితాబ్ బచ్చన్, నటుడు

అలాగే దిల్లీలోని రకబ్​ గంజ్ సాహిబ్​ కొవిడ్ సెంటర్​కు త్వరలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ చేరుకుంటాయని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే విదేశాల నుంచి 20 వెంటిలేటర్స్ ఆర్డర్ చేశానని చెప్పారు.

"ఇందులో మొదటి 10 వెంటిలేటర్స్​ ముంబయికి చేరుకున్నాయి. వీటికి అనుమతులు వచ్చాక బుధవారం నాటికి ముంబయిలోని నాలుగు ఆస్పత్రులకు వెళతాయి. మిగతా 10 ఈ నెల 25 వరకు ఇక్కడకు చేరుకుంటాయి. అవసరమున్న ఆస్పత్రులు, కేర్ సెంటర్లకు వీటిని అందజేస్తాం. అలాగే విదేశాల నుంచి తెప్పిస్తోన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ కూడా త్వరలోనే భారత్​కు వస్తాయి. ఇందులో 50 దిల్లీకి తరలిస్తాం. ఇవి పొలాండ్ నుంచి వస్తున్నాయి. అలాగే మిగతా 150 ఈనెల 23 వరకు ఇక్కడికి చేరతాయి. ఎవరికైతే అవసరం ఉంటాయో వారికి వీటిని అందజేస్తాం" అని బిగ్​బీ వెల్లడించారు.

అలాగే కొవిడ్​ ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని ఇటీవలే తెలిపారు అమితాబ్. అందుకోసం హైదరాబాద్​లోని ఓ అనాథాశ్రమం రెండు వార్డ్​లను గుర్తించినట్లు వెల్లడించారు. "హైదరాబాద్ అనాథశ్రామానికి చెందిన వారి పేర్లను రేపటి వరకు మాకు పంపిస్తారు. వారికి 1 నుంచి 10 వరకు ఉచిత విద్యను అందిస్తాం. వారు ఇందులో రాణిస్తే ఉన్నత విద్యను ఉచితంగానే అందిస్తాం" అని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details