తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​! - పవన్​ రానా మల్టీస్టారర్​

పవన్​-రానా కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్​ కోశియుమ్​'(Ayyappanum Koshiyum) రీమేక్ సినిమాకూ లీకుల బెడద తప్పడం లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో లీక్​ అవ్వగా.. ఇప్పుడు అదే షూటింగ్​లోని ఓ మరో సన్నివేశం వైరల్​గా మారింది. ​

ayyappanum-koshiyum-remake-shooting-video-leaked-in-social-media
పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​!

By

Published : Jul 29, 2021, 6:02 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(Pawan Kalyan) సినిమాకూ లీకుల బెడద తప్పడం లేదు. ఆయన దగ్గుబాటి రానాతో(Rana Daggubati) కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్​ కోశియుమ్​' రీమేక్​కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. పవన్​, రానా, నిత్యామేనన్​ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్​ అయ్యింది. అందులో పవన్​-రానా మధ్య మాటలయుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​
పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్'కు (Ayyappanum Koshiyum) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్​కల్యాణ్ బీమ్లా నాయక్​ అనే పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు రానా దగ్గుబాటితో పాటు ఐశ్వర్యారాజేశ్​(Aishwarya Rajesh), నిత్యామేనన్(Nithya Menen)​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) మాటల రచయితగా వ్యవహరించనున్నారు. ఇటీవలే విడుదలైన బీమ్లా నాయక్​ ఇంట్రో వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి..షూటింగ్​కు సిద్ధమైన పవన్​-రానా మల్టీస్టారర్​!

ABOUT THE AUTHOR

...view details