అనుభవ్ సిన్హా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.
యదార్థగాథ ఆయుష్మాన్ 'ఆర్టికల్15'
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
యదార్థగాథ ఆయుష్మాన్ 'ఆర్టికల్15'
'మన దేశంలో ఒకరి పట్ల లింగ వివక్ష, జాతి వివక్ష, కుల, మత విభేదాలు చూపించకూడదు. ఈ విషయం నేను చెప్పడంలేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 చెబుతోంది. ఇప్పటివరకు విభేదించాం. ఇకపై మార్పును తెద్దాం' అని ఆయుష్మాన్ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. దేశంలో జరిగిన కొన్నిఆసక్తికర సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 28న ‘ఆర్టికల్ 15’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.