విభిన్న కథాంశంతో వచ్చిన 'అ!'.. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని టాక్.
చర్చల దశలో 'అ!' సినిమా సీక్వెల్..! - అ! సీక్వెల్
'అ!' సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాజల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నారని సమాచారం.
చర్చల దశలో 'అ!' సినిమా సీక్వెల్..!
విజయ్ సేతుపతి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. మొదటి భాగం మాదిరి ఎక్కువ కథలు కాకుండా ఒకే కథతో సినిమా తీయనున్నారు. ఇందులోనూ కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉండనుంది. ఇతర భాషల్లోనూ తెరకెక్కించే యోచనలో ఉంది చిత్రబృందం. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో సాహో వీడియో గేమ్
Last Updated : Sep 27, 2019, 7:23 AM IST