తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాహీరోతో చిన్నారి పెళ్లి కూతురు - saidharam tej

టాలీవుడ్ మెగాపవర్​స్టార్​ సాయిధరమ్ తేజ్ సరసన 'ఉయ్యాల జంపాల' ఫేం అవికా గోర్ హీరోయిన్​గా చేయనుందని సమాచారం.

సాయిధరమ్ తేజ్

By

Published : May 3, 2019, 2:52 PM IST

'చిత్రలహరి'తో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఈ హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్​గా బుల్లితెర ద్వారా వెలుగొందిన అవికా గోర్ నటించనుందని సమాచారం.

బుల్లితెర ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై అడుగు పెడుతూనే 'ఉయ్యాల జంపాల' సినిమాతో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య అవికకు సరైన అవకాశాలు దక్కలేదు. మూడేళ్ల కిత్రం వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో చివరిసారిగా కనిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ 'చిన్నారి పెళ్లి కూతురు' తిరిగి తెరపై రీఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా మెగా ఛాన్స్‌తో.

సాయిధరమ్ తేజ్, మారుతి కలయికలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుందట అవిక. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్‌ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. మరి ఇన్నేళ్ల తర్వాత తెరపై ఓ భారీ ఆఫర్‌తో అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇకనైనా వరుస ఆఫర్లు అందుకుంటుందేమో వేచి చూడాలి.

ఇవీ చూడండి.. మే 24న 'పీఎం నరేంద్ర మోదీ' విడుదల

ABOUT THE AUTHOR

...view details