సంప్రదాయ దుస్తులు ధరించి చిరు నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్ ముద్దుల తనయ. పేరు అరిన్. ఓనం సందర్భంగా తన గారాల కూతురి ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది అసిన్.
జూనియర్ అసిన్ ఫోటోతో ఓనం శుభాకాంక్షలు! - onam
తన కూతురు ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్. ఓనం సందర్భంగా ఒక ఫొటో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
అసిన్
"తల్లిదండ్రులుగా మేము జరుపుకొంటున్న తొలి ఓనం వేడుక" అని తన భర్తతో కలిసి దిగిన మరో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే ఈ రెండు ఫొటోలు గతేడాదివంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది."వావ్, చాలా బావుంది క్యూట్ బేబీ" అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇవీ చూడండి.. జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..!
Last Updated : Sep 30, 2019, 10:14 AM IST