శ్రీరాం, సంచితా పదుకునే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అసలేం జరిగింది'. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మహావీర్ సంగీతాన్ని సమకూర్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది.
అందమైన ప్రదేశాల్లో 'అసలేం జరిగింది' - sanchitha
ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాల్లో 'అసలేం జరిగింది' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లుగా శ్రీరాం, సంచితా నటిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అసలేం జరిగింది సినిమా
లవ్, సస్పెన్స్ జానర్ కింద తెరకెక్కిన ఈ చిత్రం..కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నామని నిర్మాత చెప్పారు. ఫైట్ మాస్టర్ శంకర్ యాక్షన్ సీన్లను ఆకర్షణీయంగా తీస్తున్నారని తెలిపారు.
Last Updated : Mar 19, 2019, 8:00 PM IST