తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"నిజం కోసం పోరాటం" - లావణ్య త్రిపాఠి

నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ సురవరం' సినిమా టీజర్ విడుదలైంది.

అర్జున్ సురవరం

By

Published : Mar 4, 2019, 9:34 PM IST

నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అర్జున్ సురవరం'. తొలుత ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ పెట్టినా.. వేరే సినిమాకు అదే టైటిల్ ఉండటం వల్ల చిత్ర బృందం వెనక్కి తగ్గింది. 'అర్జున్ సురవం' అనే టైటిల్ ఖరారు చేసింది.

ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. "ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ ఒక నిజాన్ని నిజం అని ఫ్రూ చేయడం చాలా కష్టం", "వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సిన వాడు తెలియట్లేదు" అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. సినిమాను మార్చి 29న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details