యువహీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నిర్మాతలు రాజ్ కుమార్, ఠాగూర్ మధులు యూనిట్ సభ్యులతో కలిసి మూవీ విశేషాలను వెల్లడించారు.
మే నెలలో వస్తున్న నిఖిల్ 'అర్జున్ సురవరం' - tollywood
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మే 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది.
అర్జున్ సురవరం చిత్ర యూనిట్
విడుదల వాయిదా పడుతూ వచ్చిన తన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయని యువ కథానాయకుడు నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. తాజా చిత్రం 'అర్జున్ సురవరం' కూడా పలుమార్లు వాయిదా పడిందని, ఎట్టకేలకు మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. నిజాయతీగా పనిచేసే ఓ పాత్రికేయుడి కథతో సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపిన నిఖిల్.. తన గత చిత్రాల కంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ షాట్స్ అదనంగా ఉంటాయని పేర్కొన్నారు.