బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్.. త్వరలో నటి మలైకా అరోరాను పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించాడీ హీరో. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పాడు.
'ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' - malika arora
ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. ప్రస్తుతం దృష్టంతా కెరీర్‌పైనే ఉందని చెప్పాడు. ఏం చేసినా అందరికీ చెప్పే చేస్తానని అన్నాడు.
‘‘పెళ్లయితే చేసుకొంటాను. కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. బయట నా గురించి ఎన్నో మాట్లాడుకుంటారు. వాటిని పట్టించుకోను. ఎందుకంటే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, వృత్తిని బ్యాలెన్స్ చేయడం గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నాను. ఏం చేసినా మీ అందరికీ చెప్పే చేస్తాను. నేనెవరికీ భయపడాల్సిన పనిలేదు’’ -అర్జున్ కపూర్, బాలీవుడ్ హీరో
ప్రస్తుతం రాజ్ కుమార్ గుప్త దర్శకత్వంలో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రంలో నటిస్తున్నాడు అర్జున్. మే 24న ప్రేక్షకుల ముందుకురానుంది.