తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫుట్​బాల్​కు నేనూ అలాంటి అభిమానినే' - అర్జున్​ కపూర్​ ఫుట్​బాల్​ ఫ్యాన్​

పుట్​బాల్​ గేమ్​ను తాను ఎంతగానో ఇష్టపడతానని వెల్లడించాడు బాలీవుడ్​ నటుడు అర్జున్​ కపూర్​. మ్యాచ్​ వచ్చే సమయంలో బయట ప్రపంచాన్ని మరచిపోయి ఉత్సాహంలో మునిగి తేలుతానని ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వీక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఉంది.

Arjun Kapoor is true blue football fan, shares hilarious video
ఫుట్​బాల్​కు నేనూ అలాంటి అభిమానినే: అర్జున్​ కపూర్​

By

Published : Aug 11, 2020, 4:39 PM IST

చెల్సీ ఫుట్​బాల్​ క్లబ్​ను ఎంతగానో అభిమానిస్తానని తెలిపాడు బాలీవుడ్​ నటుడు అర్జున్​ కపూర్​. ఫుట్​బాల్​ మ్యాచ్​లు చూసే సమయంలో తాను ఎంతో ఉత్సాహంతో ఉంటానని ఓ పెంపుడు కుక్క వీడియోను పోలుస్తూ వెల్లడించాడు.

ఆ వీడియోలో ఓ పెంపుడు కుక్క టీవీలో వచ్చే మ్యాచ్​ను చూస్తుంది. మ్యాచ్​ అప్​డేట్స్​ను కామెంటేటర్​ అందిస్తుంటాడు. ఆటలోని ఉత్కంఠను గమనిస్తూ ఉత్సాహంతో కుక్క ఎగిరి గంతేస్తుంది. దాని పక్కన ఉన్న యజమానురాలు కుక్క హావభావాలను గమనిస్తూ నవ్వుతుంది. ఈ వీడియో వీక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఉంది. ఆ పెంపుడు కుక్క మాదిరిగానే తానూ ఫుట్​బాల్​ మ్యాచ్​ చూసేప్పుడు అదే ఉత్సాహంతో ఉంటాడని తెలిపాడు అర్జున్​ కపూర్​.

అర్జున్​ కపూర్​ షేర్​ చేసిన వీడియోను దాదాపు కొన్ని రెండు మిలియన్ల మంది వీక్షించారు. లాక్​డౌన్​లో సోషల్​ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్​లో ఉన్నాడు అర్జున్. అతడికి సంబంధించిన విషయాలను తరచుగా పోస్ట్​ చేస్తున్నాడు​.

ABOUT THE AUTHOR

...view details