దక్షిణాది అగ్రకథానాయకుడు, లోకనాయకుడు కమల్‌హాసన్ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతోపాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కరోనా మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాటలను అలపించారు. ఇప్పుడు కమల్‌హాసన్ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ ఓ పాటను రాశారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఆ పాటను అలపించారు.
లోకనాయకుడు కమల్ పాట కోసం వచ్చిన తారాలోకం - సెలబ్రిటీలతో కమల్ పాట
కరోనా కట్టడిలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు వందనం చేస్తూ ఓ పాటను విడుదల చేశారు అగ్రకథానాయకుడు కమల్‌హాసన్. ఇందులో దక్షిణాది సినీ తారలతో పాటు పలువురు గాయనీగాయకులు సందడి చేశారు.
అగ్రకథానాయకుడు కమల్‌హాసన్
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను కమల్‌తోపాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్, దేవిశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, బొంబాయి జయశ్రీ, శంకర్ మహదేవన్, సిద్ శ్రీరామ్, సిద్దార్థ్, ఆండ్రియా తదితరులు అలపించారు. ఈ వీడియోను కమల్‌తోపాటు ఇతర బృందం తమ సోషల్‌మీడియా ఖాతాల వేదికగా పంచుకున్నారు.
Last Updated : Apr 23, 2020, 7:41 PM IST