సమంత ప్రధానపాత్రలో నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ బేబీ'. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య కీలకపాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
బేబీకి 24 ఏళ్లా.. 70 ఏళ్లా..? ట్రైలర్ - samantha
సమంత, నాగశౌర్య ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఓ బేబీ'. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
సమంత
ట్రైలర్ రాజేంద్ర ప్రసాద్ బేబీ గురించి రావురమేష్తో చెప్పటం మొదలుపెట్టిన దగ్గర మొదలవుతుంది. ఆయన వర్ణిస్తుండగా ఓ కేరక్టర్ యుక్తవయసులో సమంతగా, వృద్ధురాలి పాత్రలో లక్ష్మీగా కనిపిస్తూ ట్రైలర్ కొనసాగింది. కామెడీతో పాటు చివర్లో సెంటిమెంట్ సన్నివేశాలతో మూవీపై ఆసక్తిని పెంచేలా ఉంది. జులై 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చివరలోనూ సస్పెన్స్ మాత్రం చెప్పకుండానే క్యూరియాసిటీ పెంచేశారు.
ఇవీ చూడండి.. 'రాజుగారి గది 3'లో తమన్నా..