సినీపరిశ్రమలో హీరోహీరోయిన్ల సినిమాల విషయంలో అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. వారి పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. హీరోయిన్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదట వరుసలో ఉండేది మన స్వీటీ అనుష్క అనడంలో సందేహం అవసరం లేదు. గతంలో ప్రభాస్‌ను ఈ భామ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసినా తర్వాత ఆమె పెళ్లిపై గుసగుసలు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా ఆమె తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఈహీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' సినిమా ప్రచారంలో భాగంగా ఆమె పలు విషయాలు అభిమానులతో పంచుకుంది.
అతడినే పెళ్లి చేసుకుంటా: అనుష్క
తన వివాహంపై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజం కాదని నటి అనుష్క స్పష్టం చేసింది. ఆమె నటించిన 'నిశ్శబ్దం' చిత్రం విడుదల సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ప్రశ్నకు సమాధానమిచ్చింది.
అతడినే పెళ్లి చేసుకుంటా: అనుష్క
"నేను పెద్దవాళ్లు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు" అని పేర్కొంది స్వీటీ. అనుష్క మూగ అమ్మాయిగా నటించిన 'నిశ్శబ్దం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.
ఇదీ చూడండి..'ఓ మై గాడ్ డాడీ' పూర్తి పాట వచ్చేసింది
Last Updated : Mar 2, 2020, 9:47 AM IST