తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే సినిమాలకు తాత్కాలిక విరామం: అనుష్క శర్మ - ETV Bharat

బాలీవుడ్​ నటి అనుష్కశర్మ వెండితెరకు దూరమై అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2018లో జీరో సినిమా తర్వాత ఈ అమ్మడు ఎలాంటి ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. అయితే ఇందుకు కారణాన్ని తాజాగా ఓ ముఖాముఖిలో వెల్లడించింది.

Anushka Sharma on taking a break: 'I was on auto pilot, it got exhausting, I made choices that weren’t necessarily healthy'
'అందుకే సినిమాలకు తాత్కాలిక విరామం'

By

Published : Feb 1, 2020, 9:03 PM IST

Updated : Feb 28, 2020, 7:55 PM IST

బాలీవుడ్​ భామ అనుష్క శర్మ.. 2018 చిత్రం జీరోలో కనిపించినప్పటి నుంచి సిల్వర్​స్క్రీన్‌కు దూరంగా ఉంది. అయితే కెమెరాకు దూరంగా, తన జీవితాన్ని నిర్మించుకోవడానికి పనిచేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది. అంతేకాకుండా సినిమాలకు విరామం ఇవ్వడానికి కారణాన్నీ వెల్లడించింది.

"జీవితం సాఫీగా సాగట్లేదు. గతంలో నేను ఒకేసారి రెండు సినిమా షూటింగ్​ల్లో పాల్గొన్న రోజులూ ఉన్నాయి. అప్పుడు ఆరోగ్యం కోసం పట్టించుకోలేదు. ఇప్పుడు నేను షెడ్యూల్​ పెట్టుకొని పనిచేయాలని అనుకోవట్లేదు. కొత్తగా ఏమైనా ప్రయత్నించాలని ఉంది. ఎంత సమయం పట్టినా ఆత్మసంతృప్తి కలిగించే పనే చేయాలని ఉంది. నన్ను నేను సవాలు చేసుకుంటూ ఎదగాలని భావిస్తున్నా. సినిమా గురించి ఆలోచించకుండా ఉండాలనుంది. ఇందులో భాగంగానే సొంతంగా సినిమాల నిర్మాణం ప్రారంభించాను. నా సృజనాత్మకతకు అద్దం పట్టేలా ఓ దుస్తుల తయారీ సంస్థను స్థాపించాలని ఉంది".
- అనుష్క శర్మ, బాలీవుడ్​ నటి.

అనుష్క 2018 లో వరుణ్ ధావన్‌తో 'సుయి ధాగా', షారుఖ్ ఖాన్‌తో 'జీరో' చిత్రాలలో నటించింది. 2019లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ పర్యటనలకు భర్త విరాట్ కోహ్లీతో కలిసి వెళ్ళింది. ఆమె నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్​'బుల్బుల్' పేరుతో ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదీ చూడండి..మరోసారి తెరపై పవన్​ - రేణుదేశాయ్​ కాంబినేషన్​..?

Last Updated : Feb 28, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details