బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విరాట్‌తో పాటు... లండన్‌లో గడిపిన అనుష్క ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు అంగీకరించింది.
ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'జీరో' సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ చేయలేదు. ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్.. క్లీన్ స్టేట్ ఫిల్మ్స్ నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి 'మై' అనే టైటిల్ ఖరారు చేశారు.