తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్యూన్​ కోసం జాతీయ గీతాన్నీ వదల్లేదు!

ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్​ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాను రూపొందించిన ఓ పాట కోసం ఏకంగా ఓ దేశ జాతీయ గీతాన్ని ఉపయోగించారని ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేస్తున్నారు.

By

Published : Aug 2, 2021, 3:42 PM IST

anu malik
అను మాలిక్

బాలీవుడ్​లో 400లకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కళాకారుల స్వరాలను కాపీ చేస్తారనే అపవాదు ఆయనపై ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు అదే కారణంతో ట్విట్టర్​లో ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

ఏం జరిగింది?

1996లో అజయ్ దేవ్​గన్ నటించిన 'దిల్​జలే' చిత్రానికి అనుమాలిక్ స్వరాలు సమకూర్చారు. అందులో 'మేరా ముల్క్​ మేరా దేశ్' అనే పాట ట్యూన్​ కోసం ఇజ్రాయెల్​ జాతీయ గీతాన్ని ఉపయోగించారని అంటున్నారు నెటిజన్లు.

ఎలా బయటపడింది?

టోక్యో ఒలింపిక్స్​ వల్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్​కు చెందిన జిమ్నాస్ట్​ ఆర్టెమ్ డోల్గోప్యాట్ తన దేశానికి ఆదివారం, రెండో స్వర్ణాన్ని అందించాడు. దీంతో ఆ దేశానికి చెందిన జాతీయ గీతాన్ని నిర్వాహకులు ఆలపించారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ ట్యూన్​ దిల్​జలే పాటకు దగ్గరగా ఉందని, ఓ దేశ గీతాన్ని కూడా అనుమాలిక్ వదల్లేదని విమర్శిస్తున్నారు.

ఇదీ చూడండి:Devi Sri Prasad: సంగీత 'ఉప్పెన'.. స్వరాల 'పుష్ప'మా

ABOUT THE AUTHOR

...view details