పవన్ కల్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబరు 2న ఆయన సినిమాలకు సంబంధించిన సందడి ఎక్కువగానే ఉండనుంది. ఆయా చిత్రబృందాలు అందుకోసం కసరత్తులు మొదలుపెట్టాయి. సెట్స్‌పై ఉన్న 'వకీల్‌సాబ్' ప్రచార చిత్రం ఆ రోజు విడుదల కానుంది. దర్శకుడు శ్రీరామ్ వేణు, ఆయన బృందం అదే ప్రయత్నాల్లోనే ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు సంబంధించి కూడా ఆ రోజు ఏదో ఓ విశేషం ఉంటుందని సమాచారం. వీటికి తోడు పవన్‌కల్యాణ్ చేయనున్న మరో కొత్త సినిమా కబురు ఆ రోజు వినిపించే అవకాశాలున్నాయి.
పవన్ పుట్టినరోజున కొత్త కబురు.. ఏంటది? - పవన్ కొత్త సినిమా
ఇప్పటికే చేస్తున్న సినిమాలతో పాటు పవన్‌కల్యాణ్ మరో సినిమా ప్రకటన.. ఆయన పుట్టినరోజున ఉండనుందని సమాచారం. అదే రోజు 'వకీల్‌సాబ్' ట్రైలర్ విడుదల కానుంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్
ఇప్పటికే పవన్ 'వకీల్‌సాబ్'తో పాటు క్రిష్, హరీష్‌శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. తదుపరి రామ్ తాళ్లూరి నిర్మాణంలోనూ ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఆ ప్రకటనే వెలువడే అవకాశాలున్నాయి. దీనికి దర్శకుడిగా 'కాటమరాయుడు' ఫేమ్ డాలీ (కిషోర్ కుమార్ పార్థసాని)తో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.