ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు క్లాస్ట్రోఫోబియా (పరిమిత ప్రదేశాల్లో భయపడటం) సమస్య ఉందని రియా చక్రవర్తి ఆరోపించింది. ఒకసారి ఫ్లైట్‌లో ఉన్నపుడు సుశాంత్ భయపడ్డట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఖండించింది సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే. అతడికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అంకిత "ఇది చూస్తే సుశాంత్‌కు క్లాస్ట్రోఫోబియా ఉందని అనిపిస్తోందా" అంటూ ప్రశ్నించింది.
ఈ వీడియోలో సుశాంత్ ఫ్లైట్ నడపడం నేర్చుకుంటూ కనిపిస్తున్నాడు. సుశాంత్‌కు సంబంధించిన మరో ట్వీట్‌ను రీట్వీట్ చేసింది అంకిత. దీనికి తన 50 కలల్లో మొదటిది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సుశాంత్.