లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణల నుంచి సినీతారలకు విరామం దొరికినా.. దర్శకులు మాత్రం కొత్త కథలను ముస్తాబు చేయడంలో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఓ కొత్త కథను సిద్ధం చేశారు. అది మరెవరి కోసమో కాదు.. నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం.
బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసిన అనిల్! - బాలకృష్ణ తాజా వార్తలు
వరుస హిట్లతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. లాక్‌డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు సిద్ధం చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు. బాలయ్య కోసం కూడా ఓ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
అనిల్
నిజానికి అనిల్.. బాలయ్య 100వ చిత్రానికి దర్శకత్వం చేయాలని అప్పట్లో గట్టిగా ప్రయత్నించారు. కానీ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' రూపంలో ఆ అవకాశాన్ని క్రిష్ కొట్టేశారు. కానీ, ఇప్పుడాయన మరోసారి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే బాలకృష్ణకు కథ వినిపించేందుకు సిద్ధమౌతున్నారట అనిల్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే 'ఎఫ్ 3' తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే చిత్రం బాలయ్యదే అవ్వాలని పట్టుదలతో ఉన్నారట.