మనిషి బాధ్యతారాహిత్యంతో పంచభూతాలకు తీరని నష్టం వాటిల్లితుందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టం విపత్తుల రూపంలో పెను ప్రమాదాలకు దారితీస్తున్న కారణంగా ప్రకృతి పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. అనిల్ రావిపూడి మంగళవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు.
హరిత ఉద్యమంలో దర్శకుడు అనిల్ రావిపూడి
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అరకు లోయలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, 'గాలి సంపత్' చిత్ర దర్శకుడు, హీరో శ్రీవిష్ణు పాల్గొన్నారు.
హరిత ఉద్యమంలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి
ఈ సందర్భంగా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా అరకులో జరుగుతున్న 'గాలి సంపత్' సినిమా చిత్రీకరణ ప్రాంతంలో మొక్క నాటారు. నటకిరిటీ రాజేంద్రప్రసాద్, కథానాయకుడు శ్రీవిష్ణు, నిర్మాత ఎస్. కృష్ణతో కలిసి మొక్కలు నాటిన అనిల్ రావిపూడి....ప్రకృతి మనదనే ఆలోచనతో విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులంతా ఈ ఛాలెంజ్లో పాల్గొనాలని కోరారు.